

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 15% సుంకాలను ప్రకటించిన నేపథ్యంలో, భారత్కు చెందిన సుమారు 34 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులకు మినహాయింపు ఉండొచ్చని సమాచారం వెలువడుతోంది. వాణిజ్య చట్టం-1974లోని సెక్షన్ 122 ప్రకారం 150 రోజుల వరకు ఈ సుంకాలను విధించే అవకాశం ఉంది. అయితే ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, పౌర విమానయాన రంగానికి చెందిన ఉత్పత్తులు సుంకం నుంచి మినహాయింపు జాబితాలో ఉండవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. 2024లో అమెరికాకు భారత మొత్తం ఎగుమతులు 87.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ముఖ్యంగా ఔషధ రంగానికి చెందిన 10.6 బిలియన్ డాలర్ల ఎగుమతులు, స్మార్ట్ఫోన్లు మరియు కమ్యూనికేషన్ పరికరాలు, విమానయాన రంగ ఉత్పత్తులు ఈ మినహాయింపు పరిధిలోకి రావచ్చని తెలుస్తోంది. అయితే అధికారిక ఉత్తర్వులు వెలువడకపోవడంతో అస్పష్టత కొనసాగుతోంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ప్రకారం ప్రస్తుతం 10% సుంకమే అమలులో ఉందని భావిస్తున్నారు. ఈ సుంక మార్పుల ప్రభావంపై ఇప్పుడే ఏం చెప్పలేమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!