

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు లాభాల బాటలో పయనించాయి. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా రాజకీయ పరిస్థితులు, ముడిచమురు ధరలు భారీగా తగ్గడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. దీంతో గురువారం ఉదయం మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9:16 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1,367.69 పాయింట్లు (1.77 శాతం) పెరిగి 78,669.09 వద్దకు చేరుకుంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 379.25 పాయింట్లు (1.58 శాతం) లాభపడి 24,339.85 వద్ద ట్రేడయింది. మార్కెట్ ప్రారంభం నుంచే కొనుగోళ్ల జోరు కనిపించడంతో ప్రధాన సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు 8 శాతానికి పైగా పడిపోవడం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. చమురు ధరల తగ్గుదలతో భారత్ దిగుమతి వ్యయం తగ్గడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఈ ర్యాలీలో ఆటోమొబైల్ రంగ సూచీ 2.5 శాతం పెరిగి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మారుతి సుజుకీ, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ షేర్లు స్వల్ప నష్టాలతో ట్రేడయ్యాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!