

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, గ్లోబల్ చిప్ సరఫరా గొలుసును ప్రభావితం చేసే ప్రమాదం ఉన్న శామ్సంగ్ కార్మిక సమ్మె ముప్పు తాత్కాలికంగా తొలగిపోయింది. యాజమాన్యంతో కుదిరిన తాత్కాలిక వేతన ఒప్పందం నేపథ్యంలో గురువారం ప్రారంభం కావాల్సిన సమ్మెను నిలిపివేస్తున్నట్లు శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రధాన కార్మిక సంఘం ప్రకటించింది. బుధవారం వరకు చర్చలు విఫలమైనప్పటికీ, దక్షిణ కొరియా కార్మిక మంత్రి కిమ్ యంగ్ హూన్ మధ్యవర్తిత్వంతో చివరి నిమిషంలో ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందంపై దాదాపు 48,000 మంది యూనియన్ సభ్యులు రేపు 22 నుంచి 27 వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఎస్కే హైనిక్స్తో పోలిస్తే తక్కువ వేతనాలు, బోనస్ పంపిణీ విధానంపై ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగింది. బోనస్లపై 50 శాతం పరిమితిని తొలగించాలని, వాటిని కంపెనీ లాభాలతో అనుసంధానం చేయాలని వారు డిమాండ్ చేశారు. 18 రోజుల సమ్మెకు పిలుపునిచ్చినప్పటికీ, చివరి నిమిషంలో కుదిరిన ఒప్పందంతో పరిస్థితి కొంతవరకు సద్దుమణిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!