
న్యూస్

వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ రిహానా అంబానీ ఇంటిలో సందడి చేశారు. రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో ‘ఫెంటీ బ్యూటీ’ (Fenty Beauty) ఉత్పత్తుల ప్రమోషన్ కోసం భారత్కు వచ్చిన ఆమె, అంబానీ నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అంబానీ కుటుంబం ఆమెకు ఘన స్వాగతం పలికింది.
ఈ వేడుకలో ఈశా అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్, అనంత్ అంబానీతో కలిసి రిహానా సంప్రదాయ నృత్యాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే అంబానీ కుటుంబంతో కలిసి పూజా కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా జరిగిన ఈ వేడుకల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!