
జనరల్

భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశంలో విదేశీ మారకద్రవ్య ప్రవాహాలను పెంచే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా నుంచి అధిక మొత్తంలో డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎంపిక చేసిన నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ (ఎన్‌ఆర్‌ఈ), ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ [ఎఫ్‌సీఎన్‌ఆర్(బి)] డిపాజిట్లపై అమలులో ఉన్న వడ్డీ రేటు పరిమితులను తాత్కాలికంగా తొలగించింది.
ఈ నిర్ణయం ద్వారా బ్యాంకులు విదేశాల్లో నివసిస్తున్న భారతీయులను మరింతగా ఆకర్షించే అవకాశం లభించనుంది. విదేశీ కరెన్సీ నిల్వలను బలోపేతం చేయడంతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థలో విదేశీ నిధుల ప్రవాహాన్ని పెంచడం ఈ చర్య ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు. ఆర్థిక రంగ నిపుణులు ఈ నిర్ణయాన్ని సానుకూలంగా స్వాగతిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!