

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. బుధవారం ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా 5.25 శాతం వద్దనే కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. వరుసగా నాలుగోసారి కీలక వడ్డీ రేట్లలో మార్పులు చేయకుండా ఆర్‌బీఐ ప్రస్తుత విధానాన్నే కొనసాగించడం గమనార్హం.
ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ నెలల్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లో కూడా వడ్డీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది. అయితే గత ఏడాది మాత్రం ఆర్‌బీఐ పలుమార్లు రెపో రేటును తగ్గించింది. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో 25 బేసిస్ పాయింట్లు చొప్పున కోత విధించగా, జూన్‌లో 50 బేసిస్ పాయింట్లు, డిసెంబర్‌లో మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో గత ఏడాది మొత్తం రెపో రేటు 1.25 శాతం మేర తగ్గింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!