

భారత స్టాక్ మార్కెట్లకు సంబంధించిన ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉల్లంఘించిందని సెబీ ఆరోపించింది. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ స్టాక్ విక్రయాల సందర్భంగా రహస్య సమాచారాన్ని లీక్ చేయడమే కాకుండా, ఈ వ్యవహారంపై దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని సెబీ పేర్కొంది. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ అమెరికాకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు రాయిటర్స్ వెల్లడించింది.
గతేడాది మార్చిలో జరిగిన ఈ డీల్ విలువ సుమారు 177 మిలియన్ డాలర్లు. డీల్ సమయంలో స్టాక్ ధరలు, ఇతర గోప్య సమాచారాన్ని ఉద్యోగులు, ఇన్వెస్టర్లతో పంచుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అంతర్గత దర్యాప్తులో ఉల్లంఘనలు జరగలేదని బ్యాంక్ ఆఫ్ అమెరికా చెప్పినా, సెబీ దర్యాప్తులో రహస్య సమాచారాన్ని బయటపెట్టినట్టు, తప్పుడు ప్రకటనలతో విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్టు తేలింది. ఈ అంశంపై సెబీకి సెటిల్మెంట్ కోసం బ్యాంక్ ఆఫ్ అమెరికా అప్లికేషన్ దాఖలు చేసినట్లు సమాచారం.











.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!