

టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ మరోసారి ట్రిలియనీర్గా మారారు. టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల షేర్ల విలువ పెరగడంతో సోమవారం మస్క్ నికర సంపద సుమారు 65 బిలియన్ డాలర్లు పెరిగి 1.04 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటివరకు స్పేస్ఎక్స్ షేరు విలువ 13 శాతం పెరగగా, టెస్లా షేరు ధర 6.7 శాతం ఎగబాకింది. దీంతో ఈ ఏడాది మస్క్ సంపద ట్రిలియన్ డాలర్ల మార్కును దాటడం రెండోసారి అయింది.
ఐపీఓ అంచనాల నేపథ్యంలో స్పేస్ఎక్స్ షేర్లలో భారీ పెరుగుదల నమోదవడంతో గతంలోనూ మస్క్ సంపద ట్రిలియన్ డాలర్లకు చేరింది. అయితే సంస్థ మార్కెట్ విలువపై అంచనాలు అధికంగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం కావడంతో షేర్ల విక్రయాలు పెరిగి, మస్క్ సంపద మళ్లీ ట్రిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం టెస్లా, స్పేస్ఎక్స్ షేర్లపై మదుపరుల ఆసక్తి కొనసాగుతోంది. మస్క్ నికర సంపదలో ఈ రెండు సంస్థల షేర్ల వాటానే సుమారు 98 శాతంగా ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!