

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం ధరలు బలంగా కొనసాగుతున్నాయి. నవంబర్ 12, 2025న దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
కొన్ని రోజుల స్థిరత్వం తరువాత, గత మూడు రోజులుగా బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితులు పెరగడం మరియు అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి బలహీనపడటం బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
ఈ రోజు ఉదయం 6:30 గంటల సమయానికి 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు ₹1,25,850గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర ₹1,15,360గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర ₹1,25,980, 22 క్యారెట్ల ధర ₹1,15,510గా నమోదైంది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల రేటు ₹1,25,850గా, 22 క్యారెట్ల రేటు ₹1,15,360గా ఉంది.
ఇక వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. నిన్నతో పోల్చితే కిలోకు సుమారు ₹100 మేర పెరిగినట్లు మార్కెట్ సమాచారం.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు):
హైదరాబాద్: ₹1,25,850 (24 క్యారెట్), ₹1,15,360 (22 క్యారెట్)
విజయవాడ: ₹1,25,850 (24 క్యారెట్), ₹1,15,360 (22 క్యారెట్)
ఢిల్లీ: ₹1,25,980 (24 క్యారెట్), ₹1,15,510 (22 క్యారెట్)
ముంబై: ₹1,25,850 (24 క్యారెట్), ₹1,15,360 (22 క్యారెట్)
వడోదరా: ₹1,25,900 (24 క్యారెట్), ₹1,15,410 (22 క్యారెట్)
కోల్‌కతా: ₹1,25,850 (24 క్యారెట్), ₹1,15,360 (22 క్యారెట్)
చెన్నై: ₹1,25,850 (24 క్యారెట్), ₹1,15,360 (22 క్యారెట్)
బెంగళూరు: ₹1,25,850 (24 క్యారెట్), ₹1,15,360 (22 క్యారెట్)
కేరళ: ₹1,25,850 (24 క్యారెట్), ₹1,15,360 (22 క్యారెట్)
పుణే: ₹1,25,850 (24 క్యారెట్), ₹1,15,360 (22 క్యారెట్)
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు):
హైదరాబాద్: ₹1,70,100
విజయవాడ: ₹1,70,100
ఢిల్లీ: ₹1,60,100
చెన్నై: ₹1,70,100
కోల్‌కతా: ₹1,60,100
కేరళ: ₹1,70,100
ముంబై: ₹1,60,100
బెంగళూరు: ₹1,60,100
వడోదరా: ₹1,60,100
అహ్మదాబాద్: ₹1,60,100
గమనిక: బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ధరలను తప్పనిసరిగా పరిశీలించాలి.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (2)
పసిడి ధరలు మరోసారి ఎగసిపడుతున్నాయి
కొనుగోలుదారులకు కాస్త కష్టకాలం