

గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,500గా ఉంది. నిన్న ఇదే సమయానికి ఉన్న ధరలతో పోలిస్తే దాదాపు రూ.2,230 మేర పెరిగింది. 22 క్యారెట్ 10 గ్రాముల ధర కూడా రూ.2,110 మేర పెరిగి రూ.1,43,460కు చేరుకుంది. ఇక నగరంలో వెండి ధర కూడా రూ.10 వేల మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,70,100గా ఉంది.
నేడు విడుదల కానున్న ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యపరపతి విధాన సమావేశం తాలూకు వివరాల ప్రభావం ట్రేడింగ్‌పై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. త్వరలో విడుదల కానున్న అమెరికా జీడీపీ నాలుగవ త్రైమాసిక ఫలితాలకు అనుగుణంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండనున్నాయి.
గమనిక: పై ధరలు పాఠకుల అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారుతుంటాయి. నగరం, జ్యువెలర్ లేదా తయారీదారుడి ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు వ్యాపారులను సంప్రదించడం మంచిది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!