

భారతదేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న అతిపెద్ద కరెన్సీ నోటుగా రూ.500 నోటు కొనసాగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా నివేదిక ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.500 నోట్ల చలామణి గణనీయంగా పెరిగింది. మొత్తం కరెన్సీ విలువలో సుమారు 86 శాతం వాటా ఈ నోటుదే కావడం విశేషం. అయితే ఇదే సమయంలో నకిలీ రూ.500 నోట్ల సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, నకిలీ రూ.500 నోట్ల గుర్తింపు గత ఏడాదితో పోలిస్తే దాదాపు 20 శాతం పెరిగింది. ప్రజలు నకిలీ నోట్ల బారిన పడకుండా సెక్యూరిటీ థ్రెడ్ రంగు మార్పు, వాటర్మార్క్లో మహాత్మా గాంధీ చిత్రం, ప్రత్యేక కాగితం నాణ్యత, స్వచ్ఛ భారత్ లోగో వంటి భద్రతా లక్షణాలను పరిశీలించాలని సూచిస్తోంది. కరెన్సీ నోట్ల అసలుదనాన్ని గుర్తించేందుకు ఆర్బీఐ ‘Know Your Bank Notes’ సేవను కూడా అందుబాటులో ఉంచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!