
రాజకీయాలు

అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) వెల్లడించిన వివరాల ప్రకారం, సెప్టెంబరులో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాల్లోకి నికరంగా రూ.38,306 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆగస్టులో నమోదైన రూ.29,329 కోట్లతో పోలిస్తే ఇది 31 శాతం అధికం. ఏప్రిల్‌లో వచ్చిన రూ.38,440 కోట్ల తర్వాత ఇదే అత్యధిక నెలవారీ పెట్టుబడులుగా నిలిచింది.
మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు కొనసాగడం, విదేశీ పెట్టుబడిదారులు నిధులను వెనక్కి తీసుకుంటున్నప్పటికీ ఈక్విటీ ఫండ్లలోకి పెట్టుబడులు పెరిగాయి. ముఖ్యంగా స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్లలో మదుపరులు పెట్టుబడులు కొనసాగించడం ఇందుకు దోహదపడింది. మరోవైపు, క్రమానుగత పెట్టుబడి పథకాల (సిప్) ద్వారా సెప్టెంబరులో వచ్చిన నికర పెట్టుబడులు రూ.32,490 కోట్లకు చేరి సరికొత్త గరిష్ఠ స్థాయిని నమోదు చేశాయని యాంఫీ తెలిపింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!