
సినిమాలు

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో జపాన్ కార్ బ్రాండ్లు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా మారుతి సుజుకి 42 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. భారత వినియోగదారుల్లో విశ్వాసం, నమ్మకాన్ని సంపాదించుకోవడం వల్ల జపాన్ కంపెనీలు మొత్తం మార్కెట్‌లో 52 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
దేశీయ బ్రాండ్లు టాటా, మహీంద్రా కలిసి 27 శాతం వాటాతో రెండో స్థానంలో ఉన్నాయి. కొరియా బ్రాండ్లు హ్యుందాయ్, కియా 17 శాతం వాటాను కలిగి ఉండగా, యూరోపియన్ బ్రాండ్లు 3 శాతం, చైనా బ్రాండ్లు కేవలం 1 శాతం మాత్రమే మార్కెట్‌లో ఉన్నాయి. మారుతి సుజుకి బలమైన కస్టమర్ అనుబంధమే జపాన్ ఆధిపత్యానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!