

అమెరికాలో పనిచేస్తున్న భారత ఐటీ నిపుణుల గ్రీన్‌కార్డ్ ప్రక్రియపై ప్రభావం చూపే కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా కార్మిక శాఖ శాశ్వత కార్మిక ధ్రువీకరణ కార్యక్రమం (PERM) నుంచి కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమినీతో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలను సస్పెండ్ చేసింది. ఈ సంస్థలకు సంబంధించిన కొత్త పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తులను స్వీకరించబోమని, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా ప్రాసెస్ చేయబోమని అధికారులు ప్రకటించారు.
విదేశీ ఉద్యోగులకు అమెరికాలో శాశ్వత నివాసం కల్పించే గ్రీన్‌కార్డ్ స్పాన్సర్ ప్రక్రియలో శాశ్వత కార్మిక ధ్రువీకరణ కీలక దశ. ఈ కార్యక్రమంలో సస్పెన్షన్ కారణంగా ప్రభావిత సంస్థల ఉద్యోగుల గ్రీన్‌కార్డ్ ప్రక్రియ ఆలస్యం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయం ప్రస్తుతం ఉన్న హెచ్-1బీ వీసాలను రద్దు చేయదని, ప్రధానంగా శాశ్వత కార్మిక ధ్రువీకరణ దరఖాస్తులపైనే ప్రభావం చూపుతుందని నివేదికలు పేర్కొన్నాయి. వీసా కార్యక్రమాల్లో దుర్వినియోగం, మోసాలపై అమెరికా ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తులో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!