
రాజకీయాలు

టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బహ్రామ్ వకీల్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత చైర్మన్ నోయెల్ టాటాకు 70 ఏళ్లు నిండటంతో ఆయన తన పదవి నుంచి వైదొలిగారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి బహ్రామ్ వకీల్ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. నోయెల్ టాటాకు సంస్థ చైర్మన్ ఎమెరిటస్‌గా గౌరవ హోదా కల్పించారు.
మరోవైపు, సంస్థలో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా అబిజర్ దివాన్జీని నియమించారు. ఈ నియామకాలతో టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ నాయకత్వంలో మార్పులు చోటుచేసుకున్నాయి. సంస్థ భవిష్యత్ కార్యకలాపాలు, పాలనాపరమైన నిర్ణయాల్లో కొత్త నాయకత్వం కీలక పాత్ర పోషించనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!