

2026 సంవత్సరంలో ప్రపంచ టెక్ రంగం భారీ లేఆఫ్స్‌తో వణికిపోతోంది. Layoffs.fyi విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా టెక్ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. ముఖ్యంగా మెటా సంస్థలో 8,000 మంది ఉద్యోగులను తొలగించగా, అమెజాన్‌లో 16,000 మంది, ఒరాకిల్‌లో దాదాపు 30,000 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ఈ పరిణామాలు టెక్ రంగంలో తీవ్ర ఆందోళనకు దారితీశాయి.
ఇక పేపాల్ 4,760 మంది, బ్లాక్ 4,000 మంది, సిస్కో 4,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఇంట్యూట్ సంస్థలో 3,000 మంది, వైజ్టెక్ గ్లోబల్‌లో 2,000 మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. ఖర్చులు తగ్గించడం, AI ఆధారిత ఆటోమేషన్, వ్యాపార పునర్వ్యవస్థీకరణ వంటి కారణాల వల్లే ఈ భారీ లేఆఫ్స్ జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం టెక్ ఉద్యోగుల్లో భవిష్యత్‌పై ఆందోళన పెరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!