
రాజకీయాలు

కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో దాని వెనుక ఉన్న పర్యావరణ ప్రభావంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు సమాచారం కోసం గూగుల్‌పై ఆధారపడేవారు, ఇప్పుడు వేగవంతమైన సమాధానాల కోసం ఏఐ టూల్స్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ వ్యవస్థల వెనుక ఉన్న భారీ డేటా సెంటర్లు నిరంతరం పని చేయడానికి అధిక విద్యుత్, భారీ స్థాయిలో నీరు అవసరమవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
సర్వర్లను చల్లబరచడానికి నీటి వినియోగం తప్పనిసరి కావడంతో పాటు, వాటి నిర్వహణకు అధిక విద్యుత్ అవసరం అవుతోంది. ఐక్యరాజ్యసమితి (యూఎన్) ఈ అంశంపై లెక్కలతో సహా హెచ్చరికలు జారీ చేసింది. ఏఐ వినియోగం మితిమీరితే భవిష్యత్తులో నీటి కొరత, విద్యుత్ వినియోగం పెరుగుదల వంటి సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!