

లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం, నియంత్రణ సంస్థల పర్యవేక్షణ పెరిగినప్పటికీ భారతదేశంలోని ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ‘డార్క్ ప్యాటర్న్స్’ ఇప్పటికీ వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు నిర్వహించే 95 శాతానికి పైగా లిస్టెడ్ కంపెనీలు ఉత్పత్తుల ఎంపిక, చెల్లింపులు, సబ్స్క్రిప్షన్లు, రీఫండ్ ప్రక్రియల్లో వినియోగదారుల నిర్ణయాలను ప్రభావితం చేసే మోసపూరిత డిజైన్ పద్ధతులను ఉపయోగిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీలు, లిస్టింగ్‌కు సిద్ధమవుతున్న సంస్థలు డార్క్ ప్యాటర్న్స్ ఉపయోగించడం లేదని తప్పనిసరిగా ధ్రువీకరించే విధానాన్ని అమలు చేయాలని సెబీకి అధ్యయనం సూచించింది.
ఈ నివేదికలో డ్రిప్ ప్రైసింగ్, సబ్స్క్రిప్షన్ ట్రాప్స్, దాచిన ఛార్జీలు, కన్ఫర్మ్ షేమింగ్, బైట్ అండ్ స్విచ్, ఇంటర్ఫేస్ ఇంటర్ఫెరెన్స్ వంటి మోసపూరిత పద్ధతులు ఈ-కామర్స్, బ్యాంకింగ్, ఓటీటీ, ఫుడ్ డెలివరీ, ట్రావెల్, డిజిటల్ లెండింగ్ వంటి అనేక రంగాల్లో విస్తృతంగా ఉన్నట్లు పేర్కొంది. డిజిటల్ ప్రకటనల్లో పారదర్శకతను పెంచేందుకు సెబీ ప్రతిపాదించిన కామన్ అడ్వర్టైజ్మెంట్ కోడ్ (CAC) 2026ను అధ్యయనం స్వాగతించింది. అయితే కేవలం స్వీయ ప్రకటనలపై ఆధారపడకుండా, కఠినమైన ధృవీకరణ వ్యవస్థ అవసరమని సూచించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!