

ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్మన్కు సంస్థ ప్రొడక్ట్ స్ట్రాటజీ బాధ్యతలను అధికారికంగా అప్పగించారు. ఇప్పటివరకు ఆయన సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ పనులను పర్యవేక్షిస్తుండగా, ఇప్పుడు ప్రొడక్ట్ విభాగాన్ని కూడా నడిపించనున్నారు. ఏజీఐ డిప్లాయ్‌మెంట్ సీఈఓ ఫిడ్జీ సిమో వైద్య సెలవులోకి వెళ్లిన తర్వాత బ్రాక్‌మన్ తాత్కాలికంగా ఈ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ మార్పును సంస్థ అధికారికంగా ప్రకటించింది. వినియోగదారులు, ఎంటర్ప్రైజ్ విభాగాల కోసం ఏఐ ఉత్పత్తులను మరింత సమర్థవంతంగా రూపొందించేందుకు ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు సమాచారం.
అంతేకాకుండా ఏఐ రంగంలో ఆంథ్రోపిక్, గూగుల్ వంటి సంస్థల నుంచి పెరుగుతున్న పోటీని ఎదుర్కొనేందుకు ఓపెన్ఏఐ తన ప్రధాన ఉత్పత్తులపై దృష్టి సారిస్తోంది. సొరా వీడియో జనరేటర్ వంటి కొన్ని ప్రాజెక్టులను పక్కనపెట్టి, చాట్‌జీపీటీ, కోడెక్స్, డెవలపర్ APIలను ఒకే ప్రొడక్ట్ టీమ్ కిందకు తీసుకురావాలని యోచిస్తోంది. భవిష్యత్తులో చాట్‌జీపీటీ, కోడెక్స్, అట్లాస్ బ్రౌజర్లను కలిపిన యూనిఫైడ్ డెస్క్‌టాప్ అప్లికేషన్ రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో సంస్థలో పలు కీలక అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించగా, కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సంస్థను వీడారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!