

వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) కు వెళ్లాల్సిన Crew -12 మిషన్ ప్రయోగాన్ని నాసా, స్పేస్ఎక్స్ వాయిదా వేసినట్లు ప్రకటించాయి. ఈరోజు జరగాల్సిన ప్రయోగం ఇప్పుడు ఈ నెల 12 న తర్వాతే జరిగే అవకాశముందని తెలిపాయి. ఈ మిషన్లో పాల్గొనే నాసా వ్యోమగాములు జెసికా మియర్, జాక్ హాథవే, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన సోఫీ అడెనోట్, రష్యా వ్యోమగామి ఆండ్రే ఫెద్యాయెవ్ ప్రస్తుతం అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్లో క్వారంటైన్లో ఉన్నారు.
Crew-12 నాసా నిర్వహిస్తున్న 12 వ క్రూ మిషన్. ఈ ప్రయాణం ద్వారా భవిష్యత్తులో చంద్రుడు, మంగళ గ్రహాలపై చేయనున్న అన్వేషణలకు అవసరమైన శాస్త్రీయ పరిశోధనలు చేపట్టనున్నారు. ఈ మిషన్ కోసం స్పేస్ఎక్స్కు చెందిన Crew Dragon అంతరిక్ష నౌకను ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఐఎస్ఎస్కు విజయవంతంగా చేరిన తర్వాత మిషన్ పూర్తి చేసి, వ్యోమగాములను సముద్రంలో సురక్షితంగా భూమికి తీసుకురానున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!