

దేశంలోనే తొలి ట్రై హైబ్రిడ్ స్కూటర్‌ను జమ్మూకశ్మీర్‌కు చెందిన బిలాల్ అహ్మద్ మీర్, బినిష్ గుల్జార్ రూపొందించారు. ఎండ ఉన్నప్పుడు సౌరశక్తితో నడిచే ఈ స్కూటర్, మబ్బులు కమ్మినప్పుడు పెట్రోల్ ఇంజిన్ ద్వారా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. ఇంధన పొదుపు కోసం బ్యాటరీ బ్యాకప్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. రేంజ్ ఎలివేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనే పేటెంట్ టెక్నాలజీతో పాటు ఆటోమోటివ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వ్యవస్థను ఉపయోగించి ఈ వాహనాన్ని అభివృద్ధి చేశారు.
మహిళలు, దివ్యాంగులకు సులభంగా ఉపయోగపడేలా ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు రూపకర్తలు తెలిపారు. స్విచ్ నొక్కితే పైకి, కిందికి కదిలే మూవబుల్ సీటు ఇందులో అమర్చారు. దీంతో దివ్యాంగులు కూడా సులభంగా ఎక్కి దిగే అవకాశం ఉంటుంది. జీపీఎస్, సెన్సర్లు, క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ ద్వారా వాహనం పనితీరును రియల్‌టైంలో పర్యవేక్షించడంతో పాటు సాంకేతిక సమస్యలను ముందుగానే గుర్తించే సదుపాయం కల్పించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!