
ప్రముఖ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీకి భారీ దెబ్బ తగిలింది. తాజా సమాచారం ప్రకారం, సుమారు 25 లక్షల మంది యూజర్లు చాట్‌జీపీటీని బాయ్‌కాట్ చేశారు. ఈ భారీ బహిష్కరణ వెనుక కారణం, చాట్‌జీపీటీ మాతృసంస్థ ‘ఓపెన్ ఏఐ’ అమెరికా రక్షణ శాఖ ‘పెంటగాన్’ తో కుదుర్చుకున్న ఒప్పందమే.
ఈ ఒప్పందం ప్రకారం, పెంటగాన్ విభాగంలో ఓపెన్ ఏఐ మోడల్స్ ఉపయోగించనున్నారు. అయితే, దీనిపై వ్యతిరేకంగా యూజర్లు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫోన్‌లలో ఉన్న చాట్‌జీపీటీ యాప్‌ను పెద్ద ఎత్తున డిలీట్ చేస్తున్నారు. టెక్‌క్రంచ్ నివేదిక ప్రకారం, అమెరికాలో చాట్‌జీపీటీ యాప్ అన్ఇన్‌స్టాలేషన్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి.
వ్యతిరేకత పెరుగుతుండటంతో, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ స్పందిస్తూ, “ఇది చాలా సంక్లిష్టమైన సమస్య. స్పష్టమైన కమ్యూనికేషన్ అవసరం ఉంది. పరిస్థితులను మెరుగుపరచడానికి నిజాయితీగా ప్రయత్నిస్తున్నాం” అని తెలిపారు. అదనంగా, పెంటగాన్‌తో ఉన్న ఒప్పందంలో మార్పులు చేసే దిశగా సంస్థ ఆలోచిస్తోందని సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!