

ఆపిల్ సంస్థ కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పిన్ను అభివృద్ధి చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కుపర్టినో కేంద్రంగా పనిచేస్తున్న ఈ టెక్ దిగ్గజం, వాయిస్ ఆధారితంగా పనిచేసే వేర్‌బుల్ AI పిన్ను రూపొందించేందుకు యోచిస్తోంది. ఈ పిన్‌లో కెమెరాలు, మైక్రోఫోన్లు, స్పీకర్‌తో పాటు ఫిజికల్ బటన్ కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇది ఇతర డివైస్‌లకు అనుసంధానంగా కాకుండా, స్వతంత్రంగా పనిచేసే పరికరంగా ఉండొచ్చని తెలుస్తోంది.
ది ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం, ఈ AI పిన్ పరిమాణం ఎయిర్‌ట్యాగ్‌కు సమానంగా ఉండనుంది. ఇందులో ఈ వసంతకాలంలో విడుదల కానున్న AI ఆధారిత సిరి కీలక పాత్ర పోషించనుంది. అల్యూమినియం, గ్లాస్ షెల్‌తో రూపొందే ఈ పిన్‌లో ముందు భాగంలో రెండు కెమెరాలు ఉంటాయి. వాటిలో ఒకటి సాధారణ లెన్స్ కాగా, మరోది వైడ్ యాంగిల్ లెన్స్‌గా ఉండి ఫోటోలు, వీడియోలు తీయడానికి ఉపయోగపడనుంది.
అదనంగా, ఈ పిన్‌లో మూడు మైక్రోఫోన్ల సమాహారం, ఆడియో వినిపించే స్పీకర్, వైర్లెస్ చార్జింగ్ సదుపాయం కూడా ఉండొచ్చని నివేదిక పేర్కొంది. అయితే ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉండటంతో 2027 లో విడుదలయ్యే అవకాశం ఉందని, అవసరమైతే ప్రాజెక్ట్‌ను రద్దు చేసే అవకాశం కూడా ఉందని సమాచారం. ఇదే సమయంలో ఆపిల్ ఒక రోబోటిక్ హోమ్ హబ్‌ను కూడా అభివృద్ధి చేస్తోందని, ఇందులో 7 అంగుళాల డిస్ప్లే, స్పీకర్లు, యూజర్ వైపు తిరిగే స్వివెలింగ్ బేస్ ఉండొచ్చని తెలుస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!