
జనరల్

ఐటీ రంగంపై కృత్రిమ మేధ (AI) ప్రభావంపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులతో మాట్లాడుతూ, ఏఐను ముప్పుగా కాకుండా కొత్త అవకాశాల వేదికగా చూడాలని ఆయన సూచించారు.
ప్రపంచ టెక్నాలజీ మార్కెట్‌ను మరింత విస్తరించే శక్తి ఏఐకు ఉందని, ఐటీ రంగానికి కొత్త వ్యాపార అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం టీసీఎస్ భారీ స్థాయిలో ఏఐ ఏజెంట్లను అభివృద్ధి చేస్తోందని వెల్లడించారు. భవిష్యత్తులో సంస్థలో ఉద్యోగులు, ఏఐ ఏజెంట్లు సమాన సంఖ్యలో పనిచేసే రోజు ఎంతో దూరంలో లేదని చంద్రశేఖరన్ ఆశాభావం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!