

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) రంగం వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఫ్రెషర్స్‌తో పాటు ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా ఏఐ అత్యుత్తమ కెరీర్ ఆప్షన్‌గా మారుతోంది. సరైన ఏఐ కోర్సులు నేర్చుకుంటే లక్షల్లో జీతాలు అందించే ఉద్యోగాలను సులభంగా పొందే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, జనరేటివ్ ఏఐ, ఆటోమేషన్ మరియు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వంటి రంగాల్లో డిమాండ్ భారీగా పెరుగుతోంది.
పరిశ్రమలు వేగంగా డిజిటల్ టెక్నాలజీలను స్వీకరిస్తుండటంతో ఏఐ నైపుణ్యాలకు భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం పెరగనుంది. క్లౌడ్ ఏఐ టూల్స్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి కోర్సులు ప్రస్తుతం అత్యంత డిమాండ్‌లో ఉన్నాయని కెరీర్ నిపుణులు చెబుతున్నారు. మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో పోటీగా నిలవాలంటే విద్యార్థులు, ఉద్యోగులు తమ నైపుణ్యాలను నిరంతరం అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!