
జనరల్

ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు 19 ఓవర్లలోనే ఛేదించి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కెప్టెన్ అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ అర్ధ శతకాలు సాధించి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు.
అయితే జట్టు విజయం సాధించినప్పటికీ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు బీసీసీఐ జరిమానా విధించింది. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడంతో నెమ్మదైన ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్లో ఢిల్లీకి ఇది తొలి తప్పిదం కావడంతో కేవలం జరిమానాతోనే సరిపెట్టారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!