
క్రీడలు

ఐపీఎల్ 2026 వీక్షణ గణాంకాల్లో గణనీయమైన తగ్గుదల నమోదైంది. టీవీ రేటింగ్స్ 18.8 శాతం పడిపోయి 4.57 నుండి 3.71కి తగ్గాయి. అలాగే సగటు వీక్షణ 26 శాతం తగ్గినట్లు నివేదికలు వెల్లడించాయి. మొత్తం రీచ్ కూడా 8.3 శాతం తగ్గి 123.96 మిలియన్ నుండి 113.61 మిలియన్‌కు పడిపోయింది.
ప్రకటనదారుల సంఖ్య కూడా 31 శాతం తగ్గినట్లు సమాచారం. గతంలో 65+ బ్రాండ్లు ఉండగా ఇప్పుడు 45+కి తగ్గాయి. 44 బ్రాండ్లు ఎగ్జిట్ కాగా, కేవలం 24 కొత్త బ్రాండ్లు మాత్రమే చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిణామం ఐపీఎల్ వ్యాపార విలువపై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!