

ఐపీఎల్‌తో విడదీయరాని అనుబంధం కలిగిన మహేంద్ర సింగ్ ధోనీ ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. రెండు సంవత్సరాలు మినహా 16 సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ధోనీ, ఈసారి జట్టు భాగస్వామిగా ఉన్నప్పటికీ మైదానంలో కనిపించలేదు. టోర్నీ ప్రారంభానికి ముందు గాయంతో కొన్ని వారాలు దూరంగా ఉంటాడని సీఎస్కే ప్రకటించినా, లీగ్ ముగింపు దశకు వచ్చినప్పటికీ 44 ఏళ్ల మహీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
మొదట పిక్క గాయం కారణంగానే ధోనీ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడని భావించిన అభిమానులకు తాజాగా మరో షాక్ ఎదురైంది. సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ వెల్లడించిన వివరాల ప్రకారం ధోనీ బొటనవేలికి కూడా గాయం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు స్వస్థలం రాంచీలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు చెన్నైలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు ధోనీకి ఫేర్వెల్ తరహాలో అభినందనలు తెలపడంతో, అతడు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలపై చర్చ మొదలైంది. ఏదేమైనా, ధోనీ ఆడకుండానే ఒక పూర్తి ఐపీఎల్ సీజన్ ముగియడం అభిమానులకు భావోద్వేగ క్షణంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!