
క్రీడలు

సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ టికెట్లపై భారీ బ్లాక్ దందా జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రూ.1,000 టికెట్‌ను రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, రూ.10 వేల టికెట్‌ను లక్ష నుంచి రెండు లక్షల వరకు అమ్ముతున్నారని ప్రచారం సాగుతోంది. విరాట్ కోహ్లీ క్రేజ్, ఇది హైదరాబాద్‌లో చివరి హోమ్ మ్యాచ్ కావడంతో టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
ఆన్లైన్లో కొన్ని సెకన్లలోనే టికెట్లు సోల్డ్ అవుట్ కావడం, భారీ క్యూ కనిపించడం అనుమానాలకు దారితీసింది. సోషల్ మీడియా ద్వారా నకిలీ లింకులు పంపి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు హెచ్చరించారు. ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!