
జనరల్

ఐపీఎల్‌లో శనివారం జరిగిన కోల్‌కతా , గుజరాత్ మ్యాచ్ అభిమానులకు భారీ వినోదాన్ని అందించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో కోల్కతా జట్టు 29 పరుగుల తేడాతో గుజరాత్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో కొత్త రికార్డులు నమోదు చేశారు.
ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఒకే మ్యాచ్‌లో ఆరుగురు ఆటగాళ్లు అర్థశతకాలు నమోదు చేశారు. కోల్‌కతా తరఫున అలెన్ 93, రఘువంశీ 82, గ్రీన్ 52 పరుగులు చేయగా, గుజరాత్ తరఫున శుభమన్ గిల్ 85, బట్లర్ 57, సుదర్శన్ 53 పరుగులు చేశారు. ఇదే సీజన్‌లో అత్యధికంగా 200కు పైగా జట్టు స్కోర్లు నమోదైన రికార్డు కూడా నెలకొంది. ఇప్పటివరకు 52 మ్యాచ్‌ల్లో 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!