

ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాజ్‌పుతానా రాయల్స్ అదరగొట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చేరో ఆర్చర్స్‌ను 6-0తో చిత్తు చేసింది. మహిళల కాంపౌండ్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ ఇల్లా గిబ్సన్ 60కి 60 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. తొలి సెట్‌ను 74-73తో, రెండో సెట్‌ను 76-75తో రాజ్‌పుతానా రాయల్స్ కైవసం చేసుకుంది.
మూడో సెట్లో చేరో ఆర్చర్స్ గట్టిపోటీ ఇచ్చింది. ఒక దశలో ఇరు జట్లు 58-58తో సమంగా నిలిచాయి. అయితే చివర్లో 77-75తో సెట్‌ను గెలుచుకున్న రాజ్‌పుతానా రాయల్స్ మ్యాచ్‌ను 6-0తో ముగించింది. మరో మ్యాచ్‌లో మైటీ మరాఠాస్ 6-2తో పృథ్వీరాజ్ యోధాస్‌పై విజయం సాధించింది. తొలి, రెండో, నాలుగో సెట్లను మరాఠాస్ గెలుచుకోగా.. మూడో సెట్ యోధాస్ ఖాతాలో చేరింది. మరో పోరులో కాకతీయ నైట్స్ 6-0తో చోళా చీఫ్స్‌ను ఓడించింది.
లీగ్ పాయింట్ల పట్టికలో కాకతీయ నైట్స్, మైటీ మరాఠాస్ చెరో ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. రాజ్‌పుతానా రాయల్స్, చేరో ఆర్చర్స్, పృథ్వీరాజ్ యోధాస్ తలో ఆరు పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చోళా చీఫ్స్ రెండు పాయింట్లతో చివరి స్థానంలో కొనసాగుతోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!