

చెన్నై సూపర్ కింగ్స్ ఇవాళ కీలక మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని తుది జట్టులో ఉంటారనే చర్చ కొనసాగుతోంది. అయితే మ్యాచ్‌కు ముందు చెన్నై జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఓవర్టన్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
మరోవైపు ముంబై చేతిలో పంజాబ్ ఓడిపోవడంతో చెన్నైకి ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఇవాళ లక్నోపై విజయం సాధిస్తే చెన్నై నాలుగో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత హైదరాబాద్, గుజరాత్ జట్లతో జరిగే మ్యాచ్‌లలో కనీసం ఒకదాంట్లో గెలిచినా ప్లే ఆఫ్స్ అవకాశాలు బలపడనున్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న లక్నో మాత్రం మిగతా మ్యాచ్‌ల్లో గెలిచి ప్రత్యర్థులకు షాక్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!