

ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకోగా, ఇప్పటివరకు పలువురు ఆటగాళ్లు తమ అద్భుత ప్రదర్శనలతో అభిమానులను ఆకట్టుకున్నారు. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ 14 మ్యాచుల్లో 638 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. అతడు ఒక సెంచరీ, ఏడు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అతడి సహచరుడు శుభ్‌మన్ గిల్ 616 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతుండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ 606 పరుగులతో అదరగొట్టాడు. వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో అత్యధికంగా 53 సిక్సర్లు బాదడంతో పాటు, కేవలం 36 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి సంచలనం సృష్టించాడు. ఉర్విల్ పటేల్ 13 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేయగా, కేఎల్ రాహుల్ అజేయంగా 152 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు.
బౌలింగ్ విభాగంలో ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ 24 వికెట్లతో పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. గుజరాత్ బౌలర్ కగిసో రబాడ కూడా 24 వికెట్లు తీసి పోటీనిచ్చాడు. జోఫ్రా ఆర్చర్, అన్షుల్ కాంబోజ్ చెరో 21 వికెట్లు తీశారు. లఖ్‌నవూ బౌలర్ మోసిన్ ఖాన్ అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసి, కేకేఆర్‌పై 5/23తో ఈ సీజన్‌లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశాడు. మహ్మద్ సిరాజ్ 148 డాట్ బాల్స్ వేసి తన కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యేక గుర్తింపు పొందాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!