
జనరల్

కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్‌లో భారత షట్లర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. మహిళల సింగిల్స్‌లో అశ్మిత చలిహ మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో హరిహరన్-అర్జున్ జోడీ సంచలన విజయంతో ఏడో సీడ్ పొపోవ్ సోదరులను ఓడించి రెండో రౌండ్‌కు చేరుకుంది.
ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టో పొపోవ్, తోమా జూనియర్ పొపోవ్ జోడీపై భారత ద్వయం 21-19, 21-15 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. గతవారం థామస్ కప్ సెమీఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న భారత జోడీ తదుపరి రౌండ్‌లో ఇండోనేషియా లేదా చైనా జోడీతో తలపడనుంది. భారత షట్లర్ల ప్రదర్శనపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!