
సినిమాలు

ప్రఖ్యాత నార్వే చెస్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారులు గుకేష్, ప్రజ్ఞానంద, కోనేరు హంపీ బరిలోకి దిగుతున్నారు. ఈ రోజు ప్రారంభమయ్యే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ జూన్ ఐదో తేదీ వరకు కొనసాగనుంది. ప్రపంచ స్థాయి చెస్ క్రీడాకారులు పాల్గొంటుండటంతో ఈ పోటీలపై ఆసక్తి నెలకొంది.
పురుషుల విభాగంలో గుకేష్, ప్రజ్ఞానందతో పాటు మాగ్నస్ కార్ల్‌సన్, అలీరెజా, కీమెర్, వెస్లీ సో పోటీ పడనున్నారు. మహిళల విభాగంలో కోనేరు హంపీ, దివ్యా దేశ్‌ముఖ్‌తో పాటు జు వెన్‌జున్, అన్నా ముజిచుక్, అసౌబయేవా, జు జిన్నెర్ టైటిల్ కోసం తలపడనున్నారు. భారత ఆటగాళ్ల ప్రదర్శనపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!