

ఫిఫా ప్రపంచకప్‌లో భద్రతా ఏర్పాట్లపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జర్మనీ జట్టు శిబిరంలో పాము కనిపించిన ఘటన మరువకముందే, తాజాగా దక్షిణ కొరియా జట్టు శిక్షణ శిబిరం సమీపంలో అనధికారికంగా డ్రోన్ ఎగిరిన ఘటన కలకలం రేపింది. మెక్సికోలోని గ్వాడలహారాలో ఏర్పాటు చేసిన దక్షిణ కొరియా శిబిరం వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆటగాళ్ల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
శిబిరం సమీపంలో అనుమానాస్పదంగా డ్రోన్ సంచరిస్తున్నట్లు గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దానికి అధికారిక అనుమతి లేదని నిర్ధారించిన అనంతరం మెక్సికో భద్రతా అధికారులు డ్రోన్‌ను కూల్చివేశారు. జట్టు వ్యూహాలు లేదా సన్నద్ధత వివరాలను సేకరించేందుకు డ్రోన్‌ను వినియోగించారా? లేక అనుకోకుండా నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించిందా? అనే అంశాలపై చర్చ జరుగుతోంది. దక్షిణ కొరియా-మెక్సికో మ్యాచ్‌కు ముందు ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!