

భారత యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ సీనియర్ జట్టులో అరంగేట్రానికి సిద్ధమవుతున్న తరుణంలో అనూహ్యంగా వివాదంలో చిక్కుకున్నాడు. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఈ 15 ఏళ్ల ఆటగాడు, శ్రీలంకలో జరుగుతున్న ట్రై-సిరీస్‌లో భారత్ ‘ఎ’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే శ్రీలంక ‘ఎ’తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ఓటమి అనంతరం మైదానంలో జరిగిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలంక ఆటగాళ్లతో మాటామాటా పెరిగి, వైభవ్ ఓ ప్రత్యర్థి ఆటగాడిని తోసినట్లు టీవీ దృశ్యాల్లో కనిపించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న సమయంలో నిరోషన్ డిక్వెల్లా జోక్యం చేసుకుని గొడవను ఆపాడు. అంతకుముందు అంపైర్ నిర్ణయంపై కూడా వైభవ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మ్యాచ్ అధికారులు నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో ఐసీసీ క్రమశిక్షణా చర్యలు ఉంటాయా అనే అంశం ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!