భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2024 – 25 సీజన్‌కు సంబంధించిన ‘నమన్ అవార్డ్స్ 2026’ ను ప్రకటించింది. క్రికెట్‌లో అత్యున్నత గౌరవంగా భావించే సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులకు భారత మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్ మరియు రోజర్ బిన్నీ ఎంపికయ్యారు. మహిళల క్రికెట్ అభివృద్ధికి చేసిన సేవలను గుర్తిస్తూ భారత మహిళల మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌కు మహిళల లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించారు. ఈ అవార్డులను రేపు జరగనున్న నమన్ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.
1983 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన రోజర్ బిన్నీ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసి భారత జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. తర్వాత అండర్-19 కోచ్‌గా, జాతీయ సెలెక్టర్‌గా కూడా సేవలు అందించాడు. అలాగే భారత క్రికెట్‌లో ‘ది వాల్’ గా పేరుగాంచిన రాహుల్ ద్రవిడ్ 24 వేలకుపైగా పరుగులు చేసి భారత బ్యాటింగ్‌కు బలంగా నిలిచాడు. రిటైర్మెంట్ తర్వాత యువ క్రికెటర్లకు మార్గదర్శకత్వం వహిస్తూ, అండర్-19 జట్టుతో ప్రపంచ కప్ గెలిపించి, తర్వాత భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా కూడా పనిచేశాడు.
మహిళల క్రికెట్‌లో అత్యధిక వన్డే పరుగులు (7805) సాధించిన ఆటగాళ్లలో ఒకరైన మిథాలీ రాజ్ భారత మహిళల క్రికెట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఇదే కార్యక్రమంలో పురుషుల ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా శుబ్మన్ గిల్ కు పాలి ఉమ్రిగర్ అవార్డు, మహిళల ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా స్మృతి మంధాన కు అవార్డు ప్రకటించారు. అదనంగా దేశీయ క్రికెట్‌లో ఉత్తమ ఆల్‌రౌండర్‌గా ఆయుష్ మత్రే, రంజీ ట్రోఫీలో ఉత్తమ ఆల్‌రౌండర్‌గా హర్ష్ దూబే లాలా అమర్‌నాథ్ అవార్డులను అందుకోనున్నారు. అలాగే మహిళల క్రికెట్, యువ క్రికెట్, రంజీ ట్రోఫీ, దేశీయ టోర్నమెంట్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన పలువురు ఆటగాళ్లకు ప్రత్యేక అవార్డులు ప్రకటించారు. ఈ వేడుకలో ఐదు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన భారత జట్లను కూడా సత్కరించనున్నారు.
2024 – 25 BCCI నమన్ అవార్డ్స్ ముఖ్య విజేతలు
జగ్‌మోహన్ దాల్మియా ట్రోఫీ (జూనియర్ మహిళలు): ఇరా జాదవ్
జగ్‌మోహన్ దాల్మియా ట్రోఫీ (సీనియర్ మహిళలు): షఫాలీ వర్మ
విజయ్ మర్చంట్ ట్రోఫీ U16 అత్యధిక వికెట్లు (ఎలైట్): యశ్‌బర్ధన్ సింగ్ చౌహాన్
విజయ్ మర్చంట్ ట్రోఫీ U16 అత్యధిక వికెట్లు (ప్లేట్): కిషన్ సర్కార్
విజయ్ మర్చంట్ ట్రోఫీ U16 అత్యధిక పరుగులు: శాంతను సింగ్
MA చిదంబరం ట్రోఫీ U23 అత్యధిక పరుగులు: R జశ్వంత్ శ్రీరామ్
మాధవరావు సింధియా అవార్డు (రంజీ అత్యధిక వికెట్లు): హర్ష్ దూబే, సుచిత్ J
మాధవరావు సింధియా అవార్డు (రంజీ అత్యధిక పరుగులు): YV రాథోడ్, స్నేహల్ కౌతంకర్
లాలా అమర్‌నాథ్ అవార్డు (దేశీయ పరిమిత ఓవర్లు): ఆయుష్ మత్రే
లాలా అమర్‌నాథ్ అవార్డు (రంజీ ఆల్‌రౌండర్): హర్ష్ దూబే
ఉత్తమ అంపైర్: ఉల్హాస్ గాంధే
మహిళల వన్డేల్లో అత్యధిక వికెట్లు: దీప్తి శర్మ
మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు: స్మృతి మంధాన
ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం: శ్రీ చరణి (మహిళలు), హర్షిత్ రాణా (పురుషులు)
ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్: స్మృతి మంధాన (మహిళలు), శుభ్‌మన్ గిల్ (పురుషులు)
లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీ
మహిళల లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్: మిథాలీ రాజ్










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!