

2025–26 సిరీస్‌లో భాగంగా మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. తొలి రోజు ఆట పూర్తిగా బౌలర్ల ఆధిపత్యంలో సాగింది. ఒక్కరోజే 20 వికెట్లు పడటం ఈ మ్యాచ్‌లో బౌలర్లు ఎంతగా చెలరేగారో స్పష్టంగా చూపించింది. రెండు జట్ల బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 152 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ బౌలర్ జోష్ టంగ్ ఐదు వికెట్లు తీసి మెరుపు ప్రదర్శన చేశాడు. దీంతో 21వ శతాబ్దంలో మెల్బోర్న్లో ఫైఫర్ సాధించిన తొలి ఇంగ్లాండ్ బౌలర్‌గా ఆయన రికార్డు సృష్టించాడు.
ఇంగ్లాండ్ కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో పూర్తిగా విఫలమై 29.5 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌటైంది. దీంతో 42 పరుగుల వెనుకంజలో నిలిచింది. హ్యారీ బ్రూక్ (41) టాప్ స్కోరర్‌గా నిలవగా, గస్ అట్కిన్సన్ (28) కొంత పోరాటం చూపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మైఖేల్ నెసర్ 4 వికెట్లు తీయగా, స్కాట్ బోల్యాండ్ 3, మిచెల్ స్టార్క్ 2, కామెరూన్ గ్రీన్ 1 వికెట్ పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్, తొలి రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసి మొత్తం 46 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.







.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!