

నటి సాయిపల్లవి నవంబర్ 2026లో విడుదల కానున్న ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’, ‘ఓఎం’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇదిలా ఉండగా, జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్లో ఆమె తొలి అతిథిగా పాల్గొననున్నారు. ఈ ఎపిసోడ్లో సాయిపల్లవికి సంబంధించిన కొత్త విషయాలతో పాటు, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని వివరాలు ప్రేక్షకులకు తెలిసే అవకాశం ఉంది.
సాయిపల్లవి పాల్గొన్న ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ తెలుగు టాక్ షో జీ5లో ప్రత్యేకంగా ప్రసారం కానుంది. రెండో సీజన్ అక్టోబర్ 16, 2026 నుంచి స్ట్రీమింగ్ కానుందని జీ5 ప్రకటించింది. అలాగే ప్రతి ఆదివారం జీ తెలుగు ఛానల్లోనూ ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. నవంబర్లో ఆమె నటించిన రెండు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ టాక్ షోలో సాయిపల్లవి ఏ విషయాలు పంచుకుంటారనే ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!