
జనరల్

ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vi) తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధరను పెంచింది. ఇప్పటివరకు రూ.859గా ఉన్న 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధరను రూ.40 పెంచి రూ.899కు చేర్చింది. సవరించిన ధరలు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. అయితే, ధర పెంపునకు గల కారణాలను సంస్థ వెల్లడించలేదు.
రూ.899 ప్లాన్‌తో 84 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. వీకెండ్ డేటా రోల్‌ఓవర్, ప్రతి నెలా 2 జీబీ వరకు బ్యాకప్ డేటా వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉండి, అర్హత కలిగిన వినియోగదారులు అపరిమిత 5జీ డేటాను పొందవచ్చు. అలాగే Vi మూవీస్ & టీవీ యాప్ ద్వారా బాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు, లైవ్ న్యూస్ తదితర కంటెంట్‌ను వీక్షించవచ్చు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!