

బిగ్బాస్ తెలుగు సీజన్ 10లో ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. ఏడో వారంలో నిర్వహించిన టాస్కుల్లో అమన్, ముకేష్, నీతూ, దేబ్జానీ, త్రిగుణ్ గ్రీన్ జోన్లోకి చేరుకున్నారు. దీంతో ఈ ఐదుగురికి నామినేషన్ల నుంచి మినహాయింపు లభించడంతో పాటు, రెడ్ జోన్, ఎల్లో జోన్లో ఉన్న ఇతర సభ్యులను నామినేట్ చేసే అవకాశం దక్కింది. తాజాగా విడుదలైన ప్రోమోలో రాం ప్రసాద్ వర్సెస్ త్రిగుణ్, ఝాన్సీ వర్సెస్ నీతూ, ముకేష్ వర్సెస్ రామకృష్ణ (ఆర్కే) మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఇంట్లో నామినేషన్ల హీట్ మరింత పెరిగింది.
ఝాన్సీ ఆటతీరుపై నీతూ ప్రశ్నలు లేవనెత్తగా, తన సొంత గుర్తింపుతో ఆడటం లేదంటూ విమర్శించింది. దీనికి ఝాన్సీ కూడా గట్టిగానే బదులిచ్చింది. బయట జరిగిన విషయాలను ఇంట్లో చర్చించడం కూడా ఆటలో భాగమేనా అంటూ నీతూను ప్రశ్నించింది. మరోవైపు, ఆర్కే ఆటతీరుపై ముకేష్ విమర్శలు చేయగా, తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదంటూ ఆర్కే కౌంటర్ ఇచ్చాడు. కెప్టెన్గా ఉన్న సమయంలో రాం ప్రసాద్ అన్ని పనులనూ తనే చేసుకున్నాడని త్రిగుణ్ అభిప్రాయపడ్డాడు. షాలినీ విషయంలో రాం ప్రసాద్ వ్యవహరించిన తీరుపైనా ముకేష్ విమర్శలు చేసినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. ఈ వాదోపవాదాల మధ్య చివరకు ఎవరు నామినేషన్లలోకి వస్తారనేది ఎపిసోడ్లో తేలనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!