

బిగ్ బాస్ తెలుగు 10 మూడో వారంలోకి అడుగుపెట్టడంతో ఎలిమినేషన్ ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ వారం త్రిగుణ్, సుధీర్, వర్షిణి, చరణ్, అమన్, షాలిని, వంశీ, సింగర్ ఝాన్సీ నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు హౌస్‌ను వీడబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అధికారిక ఓటింగ్ ఫలితమే తుది నిర్ణయాన్ని వెల్లడించనుండగా.. సోషల్ మీడియాలో అభిమానులు నిర్వహిస్తున్న అనధికారిక పోల్స్ మాత్రం ఆసక్తికరమైన ట్రెండ్స్‌ను చూపిస్తున్నాయి.
ఈ అనధికారిక పోలింగ్ ట్రెండ్స్ ప్రకారం సింగర్ ఝాన్సీకి తక్కువ స్థాయిలో ఓటింగ్ నమోదవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని పోల్స్‌లో ఆమెకు సుమారు 4 శాతం ఓట్లు వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత వర్షిణి, షాలిని ఉండగా.. వంశీ కూడా వారితో సమీపంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గత వారం తక్కువ స్థాయిలో ఉన్న సుధీర్ ఈసారి పుంజుకున్నట్లు అనధికారిక పోల్స్ సూచిస్తున్నాయి. త్రిగుణ్ అత్యధిక ఓటింగ్‌తో ముందంజలో ఉన్నట్లు తెలుస్తుండగా.. అమన్, చరణ్ కూడా మెరుగైన స్థితిలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఝాన్సీపై సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం జరుగుతోందనే చర్చ కూడా సాగుతోంది. కొందరు ఆమెను హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్లు, సోషల్ మీడియా యూజర్లు టార్గెట్ చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవన్నీ సోషల్ మీడియా చర్చలు, అనధికారిక పోల్స్ మాత్రమే. అసలు ఎలిమినేషన్ ఫలితం అధికారిక ఓటింగ్ ఆధారంగా వీకెండ్ ఎపిసోడ్‌లో స్పష్టమవుతుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!