

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 38 హౌస్‌మేట్స్‌కు మూడు జట్లుగా విభజించి వివిధ టాస్క్‌లు నిర్వహించారు. ఈ టాస్క్‌ల ద్వారా వైల్డ్ ఫైర్ సభ్యులకు కూడా కెప్టెన్సీ పోటీలో నిలిచే అవకాశం లభించింది. అయితే, హౌస్మేట్స్ గేమ్‌ను సరిగ్గా ఆడకపోవడం, గందరగోళం సృష్టించడంతో బిగ్‌బాస్ ఒక టాస్క్‌ను రద్దు చేశారు. అనంతరం మరో కొత్త టాస్క్ ఇచ్చి కెప్టెన్సీ రేసులో ఎవరు నిలవాలో నిర్ణయించారు.
టాస్క్‌లో భాగంగా షాలినీ, రామకృష్ణ మధ్య వాగ్వాదం జరిగింది. షాలినీని పక్కకు నెట్టాల్సిన సమయంలో రామకృష్ణ బలంగా తోశాడని ఆమె ఆరోపించింది. దీనిపై రామకృష్ణ స్పందిస్తూ, తాను ఓడిపోవడానికైనా సిద్ధమే కానీ, అంత రూఢ్గా ప్రవర్తించనని చెప్పాడు. షాలినీ శాంతించకపోవడంతో ఆమెకు క్షమాపణ చెప్పేందుకు కూడా ప్రయత్నించాడు. మరోవైపు, ఆహారం విషయంలో రోహిత్ చేసిన “దొబ్బి తింటున్నారు” అనే వ్యాఖ్య వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్య అమన్‌ను ఉద్దేశించి చేసినట్లుగా భావించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ అంశంపై నాగార్జున వీకెండ్ ఎపిసోడ్లో ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
హౌస్మేట్స్ టాస్క్ నిబంధనలను సరిగ్గా పాటించకపోవడంతో బిగ్‌బాస్ అసహనం వ్యక్తం చేసి గేమ్‌ను రద్దు చేశారు. దానికి బదులుగా వైల్డ్ ఫైర్ సభ్యులకు ప్రత్యేక టాస్క్ ఇచ్చారు. ఓజీస్ సభ్యులకు తెలియకుండా వైల్డ్ ఫైర్ టీమ్‌కు ఒక బోర్డు ఇచ్చి, అందులో ‘బ్యాక్స్టాబర్’, ‘కన్నింగ్’, ‘సేఫ్’, ‘బ్రెయిన్లెస్’, ‘మ్యానిప్యులేటివ్’, ‘విక్టిమ్ కార్డ్’ వంటి లక్షణాలను హౌస్‌మేట్స్‌కు ఆపాదించాలని సూచించారు. అనంతరం ఓజీస్ టీమ్‌లు తమ సభ్యుల్లో ఎవరికి ఆ లక్షణాలు సరిపోతాయో ఊహించాల్సి వచ్చింది.
ఈ టాస్క్‌లో వైల్డ్ ఫైర్ సభ్యులు ఇచ్చిన కొన్ని అభిప్రాయాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. శ్వేత, ఝాన్సీని ‘కన్నింగ్’గా పేర్కొనగా, అమన్‌ను ‘బ్రెయిన్లెస్’గా అభివర్ణించారు. ఆట ముగిసే సమయానికి టీమ్ బ్లూ రెండు పాయింట్లు, టీమ్ గ్రీన్ నాలుగు పాయింట్లు, వైల్డ్ ఫైర్ టీమ్ నాలుగు పాయింట్లు సాధించాయి. దీంతో టీమ్ బ్లూ కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకుంది. రోహిత్ వ్యాఖ్యలపై నాగార్జున స్పందన ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!