

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఐదో వారం ఎలిమినేషన్ పూర్తయింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వచ్చిన అపూర్వ తన ప్రయాణాన్ని ముగించింది. షాలినీ, త్రిగుణ్‌లతో వివాదాలు, ఆటలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడం ఆమెకు ప్రతికూలంగా మారినట్లు తెలుస్తోంది. ఎలిమినేషన్ ప్రకటనతో ఝాన్సీ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. అపూర్వకు వీడ్కోలు చెబుతూ, ఆమె గురించి ఎక్కువగా బాధపడతానని చెప్పింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన అపూర్వ తన ప్రయాణానికి సంబంధించిన వీడియో చూసి భావోద్వేగానికి లోనైంది. ఇంట్లోకి వెళ్లే ముందు తన తండ్రి చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటూ, ఆయన ఆశించినట్లుగానే కుటుంబ గౌరవాన్ని నిలబెట్టానని భావిస్తున్నట్లు తెలిపింది.
స్టేజ్‌పై నాగార్జున సూచనతో హౌస్‌మేట్స్‌కు బిట్టర్ షాట్స్ ఇచ్చిన అపూర్వ, వారి ఆటతీరుపై తన అభిప్రాయాలను వెల్లడించింది. రోహిత్ తనను తాను ఎక్కువగా అంచనా వేసుకోవద్దని, ఇతరులను తక్కువగా చూడకూడదని సూచించింది. రామ్ ప్రసాద్ వ్యక్తిగత సంబంధాల కారణంగా ఆటలో ఇతరులపై ఆధిపత్యం చూపుతున్నాడని, స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నాడని విమర్శించింది. షాలినీ తనదైన ఆట ఆడాలని, ఇతరుల మాటలు విన్న తర్వాతే స్పందించాలని సలహా ఇచ్చింది. అపూర్వ చేసిన ఈ వ్యాఖ్యలు హౌస్‌లోని కంటెస్టెంట్ల ఆటతీరుపై మరోసారి చర్చకు దారితీశాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!