

బిగ్ బాస్ 10 తెలుగు నాలుగో వారం ‘టోటల్ డామినేషన్’ థీమ్‌తో సాగుతోంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ ప్రతి కంటెస్టెంట్‌కు ఒక్కో డ్యాగర్ ఇచ్చారు. అయితే ఈ వారం ముగిసేలోపు కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ డ్యాగర్స్ సంపాదించుకోవాలని, అలా చేస్తే ప్రత్యేకమైన ఆఫర్ లేదా అవకాశం లభిస్తుందని చెప్పారు. ఇప్పటికే రథ నిర్మాణం టాస్కులో రెడ్ టీం ఆధిపత్యం చూపించి నామినేషన్స్‌లో అడ్వాంటేజ్ సాధించగా.. ఇప్పుడు డ్యాగర్స్ కోసం జరుగుతున్న పోటీతో హౌస్‌లో పరిస్థితులు మరింత వేడెక్కాయి.
తాజా ప్రోమోలో డ్యాగర్స్ కోసం కంటెస్టెంట్లు తీవ్రంగా పోటీపడుతున్న దృశ్యాలు కనిపించాయి. డ్యాగర్స్‌ను కెప్టెన్ రూమ్‌లో ఉంచిన నేపథ్యంలో షాలిని.. ఝాన్సీని అడ్డుకున్నట్టు కనిపించింది. ఎవరైనా ఫిజికల్ అయితే తాను దాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటానని రోహిత్ హెచ్చరించాడు. మరోవైపు త్రిగుణ్ ఒక డ్యాగర్ సంపాదించుకున్నట్టు కనిపించగా.. అమన్ అతనితో ఫిజికల్‌గా గొడవపడిన దృశ్యాలు ప్రోమోలో ఉన్నాయి. అలాగే ముకేష్‌ను రోహిత్ చేతులతో అడ్డుకున్నట్టు కనిపించింది. నరేష్, దేబ్జానీ, రాం ప్రసాద్ మధ్య సరదా సన్నివేశాలు కూడా కనిపించినప్పటికీ.. మొత్తంగా ప్రోమో ఇంట్లో తీవ్ర ఉద్రిక్తతకు సంకేతాలు ఇచ్చింది. కొందరు కంటెస్టెంట్లు హద్దులు దాటి ప్రవర్తించినట్టు కనిపించడంతో వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!