

విడుదల తేదీ: డిసెంబర్ 25, 2025
నటీనటులు: త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, పృథ్వీరాజ్, మైమ్ మధు
దర్శకుడు & రచన: శ్రీనివాస్ మన్నె
నిర్మాత: పోతుల హేమ వెంకటేశ్వరరావు
సంగీతం: ఆర్ ఆర్ ధృవన్
సమర్పణ: కె ఎల్ దామోదర్ ప్రసాద్
దెయ్యాలు, ఆత్మలు లేవని గట్టిగా నమ్మే నలుగురు స్నేహితులు మూఢనమ్మకాల పేరుతో ప్రజలను మోసం చేసే నకిలీ బాబాల్ని ఎదిరిస్తుంటారు. ఆ క్రమంలోనే ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో నివసించే ఆది దేవ్ అనే బాబా గురించి తెలుసుకుంటారు. ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తేనే నమ్ముతామని అతడిని సవాల్ చేస్తారు. అందుకు ప్రతిగా ఆ బాబా వారిని మూడు రోజుల పాటు ఓ పాడుబడ్డ బంగ్లాలో ఉండమని సవాల్ విసురుతాడు. ఆ బంగ్లాలో వారికి ఎదురైన భయానక అనుభవాలు, అక్కడ సంచరిస్తున్న పుణ్యవతి ఆత్మ వెనుక ఉన్న కథే ఈ సినిమా.
• ద్వితీయార్థంలో కొన్ని భయపెట్టే సన్నివేశాలు
• మైమ్ మధు నటన ప్రధాన ఆకర్షణ
• ఆసక్తికరంగా సాగే క్లైమాక్స్
• రొటీన్ హారర్ కథ
• కీలక విషయాలను చూపించకుండా మాటలతో చెప్పడం
• పూర్తిగా వినియోగించుకోలేని కాన్సెప్ట్
నేపథ్య సంగీతం కొన్ని చోట్ల భయాన్ని పెంచుతుంది. కెమెరా పనితనం సగటుగా ఉంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగానే ఉన్నాయి కానీ కొత్తదనం అనిపించవు.
ఈషా కొన్ని చోట్ల భయపెడుతుంది, చివర్లో కొంత థ్రిల్‌ను ఇస్తుంది. అయితే పూర్తిస్థాయి హారర్ అనుభూతిని అందించలేకపోతుంది. ఈ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఓసారి చూడదగ్గ చిత్రం.
రేటింగ్: 2.75 / 5










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!