

చిత్రం: ఆంధ్ర కింగ్ తాలూకా
సమయం: 2 గంటలు 46 నిమిషాలు
తరహా: యాక్షన్ & రొమాంటిక్ డ్రామా
రిలీజ్ తేదీ: 27-11-2025
నటీనటులు: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్స్, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, సత్య, రాజీవ్ కనకాల, తులసి, సింధు తొలని తదితరులు
నిర్మాత: నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: వివేక్–మెర్విన్
సంప్రదాయానికి భిన్నంగా, హృదయాన్ని హత్తుకునే ఫ్యాన్ & లవ్ డ్రామా
గోదావరి జిల్లాలోని గోదపల్లి లంకకు చెందిన సాగర్ (రామ్ పోతినేని) ‘ఆంధ్ర కింగ్’ సూర్య (ఉపేంద్ర)కు వీరాభిమాని. మహాలక్ష్మీ (భాగ్యశ్రీ బోర్స్)పై ప్రేమలో పడిన సాగర్, ఆమె తండ్రి తక్కువ చేసి మాట్లాడిన తర్వాత గ్రామంలోనే పెద్ద సినిమా థియేటర్ నిర్మిస్తానని ఛాలెంజ్ చేస్తాడు.
అయితే, తన ఫేవరెట్ హీరో సూర్య కోసం ఆ థియేటర్ అమ్మేసి డబ్బు పంపించాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు?
సూర్య శతదినోత్సవ సినిమా, సాగర్ లవ్ స్టోరీకి ఏ విధంగా సంబంధించినది?
సాగర్–సూర్య ఎవరెవరిని ఎప్పుడు కలుసుకుంటారు?
ఈ ప్రేమకథ ఎలా ముగుస్తుంది?
అదే మిగతా కథ.
ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మొత్తం నిజాయితీతో నిండిన కథనమే ప్రధాన బలం. రామ్ పోతినేని చాలా కాలం తర్వాత ఓ కొత్త ధోరణి, ఓపికతో చేసిన పాత్రలో మెరిశాడు. స్టార్ హీరో–డైహార్డ్ ఫ్యాన్ మధ్య బంధాన్ని దర్శకుడు భావోద్వేగంగా, అలంకారములేకుండా, మనసుకు దగ్గరగా చూపించాడు.
ఉపేంద్ర స్క్రీన్ టైమ్ తక్కువ ఉన్నా, కీలకమైన సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకు మెయిన్ హైలైట్. రెండో అరలో జరిగే ఎమోషనల్ ట్రాక్, ఆలయ ఎపిసోడ్, సూర్య కేరెక్టర్ ఎంట్రీ - all well written & well executed.
రావు రమేష్, మురళీ శర్మ ప్రీ–ఇంటర్వెల్, ఆలయ సన్నివేశాల్లో అద్భుతం చేశారు. భాగ్యశ్రీ బోర్స్ తన పాత్రకు న్యాయం చేసింది. సంగీతం సినిమా ఆత్మలా నిలిచింది. రెండు మెలోడి సాంగ్స్ ప్రత్యేక ఆకర్షణ.
అయితే మొదటి భాగంలో పేస్ స్లోగా ఉండటం, కొన్ని సీన్స్ లెంగ్తీగా అనిపించడం లోపాలుగా చెప్పాలి.
రెండో భాగంలో భావోద్వేగ సీన్స్ పీక్స్
రామ్ పోతినేని కొత్తగా కనిపించిన నటన
ఉపేంద్ర క్లైమాక్స్ సీన్
రావు రమేష్ ఆలయ సీక్వెన్స్
అద్భుతమైన పాటలు & బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
బాగా రాసిన డైలాగులు
ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్
కొన్ని సన్నివేశాల్లో బలహీనమైన VFX
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ హృదయానికి హత్తుకునే ఫ్యాన్–ఎమోషనల్ డ్రామాగా బాగా ఆకట్టుకుంటుంది. స్లో మొదటి భాగాన్ని దాటితే, కథనం, భావోద్వేగాలు, నటన - all come together beautifully. రామ్‌కు ఎంతో అవసరమైన హిట్ ఇదే అవుతుంది. ఫ్యామిలీ & ఫ్రెండ్స్‌తో చూసేందుకు మంచి సినిమా.











కామెంట్స్ (3)
😍😍
రామ్–ఉపేంద్ర కాంబినేషన్ హైలైట్ కావడం ఖాయం!
woww..