

విడుదల తేదీ: జనవరి 14, 2026
నటీనటులు: నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి, రావు రమేష్, తారక్ పొన్నప్ప, ఇతరులు
దర్శకుడు: మారీ
నిర్మాతలు: నాగ వంశీ ఎస్, సాయి సౌజన్య
సంగీత దర్శకుడు: మిక్కీ జే. మేయర్
సినిమాటోగ్రాఫర్: జె. యువరాజ్
ఎడిటర్: వంశీ అట్లూరి
కథ:
ఒకప్పుడు సంపన్న కుటుంబానికి వారసుడైన రాజు (నవీన్ పోలిశెట్టి), తన తాత ఆస్తిని వృథా చేయడంతో ఆర్థికంగా కష్టాల్లో పడతాడు. ధనవంతురాలిని పెళ్లి చేసుకోవాలనే లక్ష్యంతో చారులత (మీనాక్షి చౌదరి)ని కలుస్తాడు. తెలివితేటలతో ఆమెకు దగ్గరవుతాడు. కానీ ఆమె గురించి తెలిసిన ఓ నిజం అతని జీవితాన్ని మలుపుతిప్పుతుంది.
ప్లస్ పాయింట్లు:
సినిమా మొత్తం నవీన్ పోలిశెట్టిపైనే ఆధారపడుతుంది. అతని కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను నవ్విస్తాయి. రచనలోనూ అతని భాగస్వామ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో వినోదం బాగా పండింది. మీనాక్షి చౌదరి పాత్రకు న్యాయం చేశారు. రావు రమేష్ సహా సహనటీనటులు బాగానే చేశారు.
మైనస్ పాయింట్లు:
చివరి భాగంలో ఎమోషనల్ సన్నివేశాలు ఆశించిన స్థాయిలో పనిచేయవు. టోన్ అకస్మాత్తుగా మారినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొంత నెమ్మదిగా సాగుతుంది. ప్రత్యేక పాట కథనానికి అడ్డంకిగా మారుతుంది. విలన్ ట్రాక్ బలహీనంగా ఉంటుంది.
సాంకేతిక విభాగం:
మిక్కీ జే. మేయర్ సంగీతం సరైన స్థాయిలో ఉంది. గ్రామీణ నేపథ్యాన్ని సినిమాటోగ్రాఫర్ యువరాజ్ చక్కగా చూపించారు. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్‌లో కట్టుదిట్టంగా ఉన్నా, తర్వాత కొంత ట్రిమ్ అవసరం.
తీర్పు:
మొత్తానికి అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి వినోదంతో నడిచే లైట్ ఎంటర్టైనర్. బలమైన కథ లేకపోయినా, పండగ సీజన్లో టైమ్‌పాస్ వాచ్‌గా చూడొచ్చు.
రేటింగ్: 2.75/5







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!