

చెన్నై: మరికొద్ది నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సినీ నటుడు విజయ్ రాజకీయ రంగంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన నాయకత్వంలో ఏర్పాటైన కొత్త పార్టీ టీవీకే (TVK) తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగనుంది. విజయ్ రాజకీయ ప్రవేశం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది.
ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి ‘విజిల్’ ఎన్నికల గుర్తును కేటాయించింది. పార్టీ తరఫున ఆటో, విజిల్, క్రికెట్ బ్యాట్ గుర్తుల కోసం దరఖాస్తు చేయగా, వాటిలో విజిల్ గుర్తునే ఈసీ తుది గుర్తుగా ప్రకటించింది. ఈ గుర్తుతో టీవీకే పార్టీ అధికారికంగా ఎన్నికల్లో పాల్గొననుంది.
ఏప్రిల్, మే నెలల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ తొలిసారి పోటీ చేయనుంది. విజయ్ నాయకత్వంలో ఈ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకురాగలదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!